హఫీజ్ ఖాన్ కుటుంబానికి పరామర్శించిన ఒంటెద్దు నరసింహారెడ్డి
మఠంపల్లి అక్టోబర్ 03 (విజయక్రాంతి) : మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి(Raghunathapalem village) చెందిన మర్కస్ మస్జిద్ కమిటీ మాజీ అధ్యక్షుడు,బీఆర్‌ఎస్ యువ నాయకుడు పఠాన్ హఫీజ్ ఖాన్(Pathan Hafeez Khan) కుటుంబంలో ఇటీవల విషాదం చోటు చేసుకున్న సంఘటన తెలిసిందే.ఈ సందర్భంగా హుజూర్‌నగర్ నియోజకవర్గ(Huzurnagar Constituency) బీఆర్‌ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి శనివారం ఆయన స్వయంగా హఫీజ్ ఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హఫీజ్ ఖాన్ భార్య షకీలా మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, కడియం వెంకటరెడ్డి,సీనియర్ నాయకులు డాక్టర్ కేఎల్‌ఎన్ రెడ్డి,మఠంపల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య,పచ్చిపాల ఉపేందర్,మర్కస్ మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్,సర్పంచ్ హరిచంద్ర నాయక్,మండల నాయకులు కోటానాయక్,వెంకటరెడ్డి, పరాశరం అయ్యప్ప,శివారెడ్డి, రామచంద్రయ్య రాజీవ్,బాలు నాయక్,మట్టపల్లి, తదితరులు పాల్గొన్నారు.