కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై పట్టభద్రులు నిలదీయాలి

03-10-2026 | 09:46pm

ఒంటెద్దు నరసింహారెడ్డి

చింతలపాలెం, అక్టోబర్ 3: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఇచ్చిన హామీల అమలుపై పట్టభద్రులు ప్రశ్నించాలని హుజూర్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. చింతలపాలెం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduates MLC) ఓటరు నమోదు కార్యక్రమంలో(Voter registration drive) ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహిస్తున్న జాబ్ మేళాల్లో(Job Fair) రిజిస్ట్రేషన్ల సంఖ్యను మాత్రమే చెబుతున్నారని, వాస్తవంగా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమల్లో స్థానికులకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నరసింహారెడ్డి సూచించారు.

అనంతరం ఓటరు నమోదు ప్రక్రియ, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో మధిర సత్యనారాయణ, కెఎల్ఎన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు మోర్తాల వెంకటరెడ్డి, సర్పంచ్ కందుల రామకోటిరెడ్డి, వెంకట్ గౌడ్, గుజ్జుల నరసింహారెడ్డి, ప్రభాకర్, షేక్ షబిల్, రియాజ్, ధరావత్ నరసింహ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు