తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ హరిసింగ్
22-09-2026 | 11:19pm
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్ 22: మండల కేంద్రం అర్వపల్లిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ హరిసింగ్(Additional Collector Harisingh) మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో కొనసాగుతున్న 'సర్' ప్రక్రియ నిర్వహణపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించి, అధికారులకు, సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు. 'సర్' ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని తహసీల్దార్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, డీటీ అశ్విని, బీఎల్ఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.