శాతవాహనలో "అనలిటికల్ మెథడ్స్" పై కార్యశాల
ముకరంపుర, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం(Satavahana University)లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "హాండ్స్-ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటికల్ మెథడ్స్"అనే అంశంపై రెండు రోజుల కార్యశాల విశ్వవిద్యాలయ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో ప్రారంభమైంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అభివృద్ధి కోసం చేపట్టిన "అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్-100 రోజుల ప్రత్యేక ప్రణాళిక"లో భాగంగా ఈ కార్యశాల ఏర్పాటు చేయగా సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్ రమాకాంత్ అధ్యక్షతన ప్రారంభం కాగ ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు, పరిశోధకులకు ప్రయోగాత్మక విశ్లేషణా పద్ధతులపై పరిజ్ఞానం ఎంతగానో అవసరమని, రసాయన శాస్త్రంలో విభిన్న పరిశోధనలకు ఈ కార్యశాల ఉపయోగపడాలన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్ఐటీ వరంగల్ విశ్రాంత ఆచార్య కొత్త లక్ష్మారెడ్డి కీలక ఉపన్యాసకులుగా విచ్చేసి మాట్లాడుతూ నిత్యజీవితంలో రసాయన శాస్త్ర ఉపయోగాలు , శాస్త్ర ఆవశ్యకత, వివిధ పరిశోధనలకు సంబంధించిన కీలక అంశాలను వివరించారు.