ప్రమాద భీమా చెక్కు పంపిణి
22-09-2026 | 11:29pm
కోహెడ, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కోహెడ మండలం(Koheda Mandal)లోని రామచంద్రపూర్ గ్రామానికి చెందిన బొబ్బల కనకారెడ్డి గత రెండు సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందారు. కోహెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో క్రాప్ లోన్ ఉండడం వల్ల ప్రమాద భీమా రూ.1 లక్ష మంజూరు అయింది. కోహెడ ప్యాక్స్ చైర్మెన్ పేర్యాల దేవేందర్, kdccb బ్యాంక్ మేనేజర్ మోయిజ్ పాషా kdcc బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్ మహిపాల్, కోహెడ ప్యాక్స్ సెక్రటరీ మల్లిఖార్జున్ గౌడ్, మృతుని కుటుంబానికి అందించారు.