వినాయక నిమజ్జనం కోసం చెరువు పరిశీలన
22-09-2026 | 11:10pm
మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని నూతన్ కల్ లో వినాయక నిమజ్జనం(Vinayaka immersion) కోసం మున్సిపల్ పట్టణ సమీపంలోని చెరువును మున్సిపల్ పట్టణ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ కృష్ణా రెడ్డి లు పరిశీలన చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు,అంగన్వాడి కేంద్రాలను సందర్శించినట్లు వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ క్యాన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి.చిన్నోళ్ల భాస్కర్.నేతి వేణుగౌడ్.బిఆర్ఎస్ పార్టీ నాయకులు యూనిస్ పాషా.తలారి భూషణం.దొంగల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..