విదర్భకు ఉమేశ్ గుడ్ బై

06-10-2026 | 05:05am

పంజాబ్ తరపున ఆడనున్న పేసర్

ఛండీఘర్, అక్టోబర్ 5 : భారత వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్(Umesh Yadav) కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత రాష్ట్రం విదర్భ జట్టుకు(Vidarbha team) గుడ్ బై చెప్పాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం నుంచి విదర్భకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. దేశవాళీ సీజన్ 2026-27కు ముందే కొత్త జట్టు మారాడు. వచ్చే సీజన్‌లో పంజాబ్ తరపున బరిలోకి దిగబోతున్నాడు. ఉమేశ్ యాదవ్ 2008లో ఫస్ట్-క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటి నుండి తన సొంత రాష్ట్రమైన విదర్భ జట్టుకే ఆడుతున్నాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చరిత్రలోనే ఒక సీనియర్ ఆటగాడిని గెస్ట్ ప్లేయర్‌గా సంతకం చేయించుకోవడం ఇదే తొలిసారి. 

మరిన్ని వార్తలు