ప్రతీకారానికి వేళాయే
- నేడు మహిళల ఆసియా కప్ ఫైనల్
- శ్రీలంకతో భారత్ టైటిల్ పోరు
- ఓటమి లేకుండా ఫైనల్ చేరిన ఇరు జట్లు
దుబాయి, సెప్టెంబర్ 12 : మహిళల ఆసియా కప్ (Asia Cup) ఫైనల్‌కు అంతా సిద్ధమయింది. ఆదివారం దుబాయి స్టేడియం (Dubai Stadium) వేదికగా భా రత్, శ్రీలంక టైటిల్ కోసం తలపడనున్నాయి. సెమీఫైనల్సలో బంగ్లాదేశ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించగా, డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక జట్టు పాకిస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఓటమి ఎరుగకుండా అజేయంగా నిలిచా యి.
2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలోనే ఓడిన భారత్ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనీ ఎదురుచూస్తోంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్లతో కూడిన బ్యాటింగ్ లైనప్ ఈ టోర్నీలోనే అత్యధిక స్కోర్లు 150 ప్లస్ నమో దు చేసింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ, శ్రీ చరణి, ప్రేమా రావత్ వంటి స్పిన్నర్లు అద్భుతమైన ఫాంలో ఉన్నారు. అన్ని విభాగాల్లోనూ మం చి ఫామ్‌లో ఉన్న భారత్ కలిసికట్టుగా రాణి స్తే టైటిల్ గెలవడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు.
మరోవైపు శ్రీలంకను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. డిఫెండింగ్ చాం పియన్‌గా బరిలోకి దిగుతున్న లంక కూడా ఓటమి లేకుండా ఫైనల్‌కు చేరింది. కెప్టెన్ చ మరి ఆటపట్టు ఆ జట్టుకు ప్రధాన బలం. సెమీఫైనల్లో హర్షిత సమరవిక్రమ (36), కవి షా దిల్హారి (33) బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించారు. వారి స్పిన్ బౌలింగ్ కూడా భారత బ్యాటర్లను కట్టడి చేయగలదు. గత రికార్డుల ప్రకారం టీ20 క్రికెట్ చరిత్రలో శ్రీలంకపై భారత్‌కు స్పష్టమైన ఆధిపత్యం ఉంది.
ఇప్పటివరకు ఆడిన 31 మ్యాచ్‌లో భారత్ 25 సార్లు విజయం సాధించగా, శ్రీ లంక కేవలం 5 మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఇక పిచ్ విషయానికొస్తే దుబాయ్ పిచ్ ప్రస్తుత టోర్నీలో లో-స్కోరింగ్ మ్యాచ్‌ల కు వేదికైంది. ఇక్కడ పిచ్ నెమ్మదిగా ఉంటూ స్పిన్నర్లకు, స్లో బౌలర్లకు బాగా సహకరిస్తోం ది.
బ్యాటర్లకు షాట్లు ఆడటం కొంచెం కష్టం గా మారే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఇ ప్పటివరకు జరిగిన 14 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే 9 సార్లు గెలిచాయి. కా బట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.