మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

13-09-2026 | 10:01am

అధ్యక్షుడిగా కంకణాల చిన్న కొమురయ్య

ఉపాధ్యక్షుడిగా చొప్పరి అరుణ్‌కుమార్

సుల్తానాబాద్,సెప్టెంబర్‌, 13 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాలలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం(Fishermen Industrial Cooperative Society) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం సభ్యులు, మత్స్యకారుల సమక్షంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో అధ్యక్షుడిగా కంకణాల చిన్న కొమురయ్య, ఉపాధ్యక్షుడిగా చొప్పరి అరుణ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అలాగే సంఘం ప్రధాన కార్యదర్శిగా చీకట్ల నాగరాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, డైరెక్టర్ లు గా కొలిపాక రమేష్, చీకట్ల సారయ్య, చొప్పరి శ్రీనివాస్, ఉస్తేం శంకరయ్య, కంకణాల ప్రభాకర్, బొజ్జ రమేష్,ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

మత్స్యకారుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని, సంఘ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.మత్స్యకారుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన మత్స్యకారులకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సంఘ సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సిద్ధ తిరుపతి, మాజీ కౌన్సిలర్ గుర్రాల శ్రీనివాస్, మాజీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం, మాజీ సంఘం ప్రెసిడెంట్, సంఘం  వైస్ ప్రెసిడెంట్ చొప్పరి శ్రీనివాస్,ఉస్తేం రవి, మాజీ ఎంపీటీసీ,కంకణాల ఆశాలు, చీకట్ల రాజయ్య, ఉస్తేం శ్రీనివాస్, కంకణాల తిరుపతి,సంఘ సభ్యులు, మత్స్యకారులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు..

మరిన్ని వార్తలు