ఫైనల్లో తన్వి, గాయత్రి జోడీ

29-11-2026 | 05:10am

లక్నో, నవంబర్ 28: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో (Syed Modi International Badminton Tournament)భారత యువ షట్లర్ తన్వి శర్మ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తన్వి 11 21 21 స్కోరుతో మనదేశానికే చెందిన ఉన్నతి హు డాపై విజయం సాధించింది. ఊహించినట్టుగానే ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలిగేమ్‌లో ఓడిపోయినా తన్వి అద్భుతంగా పుంజుకుని స్కోరు సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైతం ఆధిపత్యం కనబరిచి ఫైనల్లో అడుగుపెట్టింది.

ఆదివారం జరిగే టైటిల్ పోరులో థాయ్‌లాండ్‌కు చెందిన నాలుగో సీజ్ సుపానిడ కాటేతంగ్‌తో తలపడుతుంది. మరోవైపు మహిళల డబుల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియ న్లు గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కూడా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆసక్తికరంగా సాగిన సెమీఫైమల్లో గాయత్రి జోడీ 13 21 21 స్కోరుతో ఉక్రెయిన్‌కు చెందిన మూడో సీడ్ పోలీనా బురో వా జోడీపై గెలుపొందింది. తొలి గేమ్  కోల్పోయి వెనుకబడిన తర్వాత పుం జుకున్న భారత జోడీ వరుస గేమ్స్‌లో గెలిచి మూడో టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇండోనే షియాకు చెందిన సైహిరా జోడీ తో గాయత్రి జోడీ తలపడుతుంది.


మరిన్ని వార్తలు