ఉప్పల్ టీ20కి భారీ భద్రత

13-10-2026 | 05:05am
  1.    2200 మంది పోలీసులతో బందోబస్తు
  2.    408 సీసీ కెమెరాలతో నిఘా
  3. మహిళల భద్రతకు షీ టీమ్స్

ఉప్పల్, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : భారత్, వెస్టిండీస్(India, West Indies) మధ్య ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం(Uppal Rajiv Gandhi Stadium) వేదికగా బుధవారం జరిగే టీ20 మ్యాచ్‌కు పోలీసులు భారీ భద్రతా(Police have deployed heavy security.) ఏర్పాట్లు చేసారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మ్యాచ్ సజావుగా జరిగేందుకు పటిష్ట మైన భద్రతా చర్య లను చేపట్టినట్టుమల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి(Police Commissioner B. Sumathi) (ఐపీఎస్) తెలిపారు. మ్యాచ్ ప్ర శాంత వాతావరణంలో జరిగేలా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రేక్షకుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ మ్యాచ్‌కు 2,200 మంది పోలీసు, సహాయక భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్టేడియం లోపల, వెలుపల భద్రతను పర్యవేక్షించేందుకు 408 సీసీ కెమెరాలను వినియోగించనున్నారు. రద్దీని ని యంత్రించడంతో పాటు ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు రెండు డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు, ప్రేక్షకుల భద్రతకు ప్రత్యేక బృందాలను నియమించారు.

అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచడంతో పాటు నకిలీ టికెట్ల విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 8 వేల వాహ నాలకు పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, రామంతాపూర్, నాగోల్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక మార్గాలను సూచించారు. మ్యాచ్ సమయంలో భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్య లు చేపడుతున్నారు.

మహిళలను వేధించే వారిపై నిఘా ఉంచేందుకు ఐదు ప్రత్యేక షీ టీమ్స్‌ను రంగంలోకి దించనున్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్ర త్యేక తనిఖీలు చేపట్టనున్నారు. మ్యాచ్ అనంతరం ప్రేక్షకుల రవాణా సౌకర్యార్థం అదనపు ఆర్టీసీ బస్సులు, మె ట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.ప్రేక్షకులు ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని, వీలైనంత వరకు మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులను వినియోగించాలని పోలీసులు సూచించారు.

మరిన్ని వార్తలు