కివీస్ దూకుడుకు భారత్ బ్రేక్
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత్–న్యూజిలాండ్ మధ్య తొలి T20 International మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. దూకుడు మీదున్న ఫిన్ అలెన్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అలెన్ బౌండరీ లైన్ వద్ద తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో న్యూజిల్యాండ్ 9 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో D. Mitchell (12), G. Phillipe (05) బ్యాటింగ్ చేస్తున్నారు.
పేసర్లకు కలిసొచ్చే పిచ్.. భారత్ గురి అదే!
క్రైస్ట్‌చర్చ్‌లోని Hagley Oval Pitchపై పేసర్లకు బౌన్స్, సీమ్ మూవ్‌మెంట్ లభించే అవకాశం ఉండటంతో భారత బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీసి న్యూజిలాండ్‌పై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు. మరోవైపు సొంత మైదానంలో ఆడుతున్న కివీస్ బ్యాటర్లు వేగంగా పరుగులు సాధించి భారీ స్కోరు అందించాలని లక్ష్యంగా పెట్టుకోనున్నారు. తొలి పవర్‌ప్లేలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది మ్యాచ్‌లో కీలకంగా మారనుంది.
తొలి టీ20లో ఎవరిది పైచేయి?
ఐదు మ్యాచ్‌ల India vs New Zealand T20I Seriesలో తొలి పోరు కావడంతో ఇరు జట్లకూ శుభారంభం కీలకం. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. కివీస్ బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ఎదుర్కొని ఎలాంటి స్కోరు సాధిస్తారు? లక్ష్య ఛేదనలో టీమిండియా ఎలా ఆడుతుంది? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.