ఉచిత కంటి వైద్య శిబిరం.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

22-10-2026 | 01:55pm

బోథ్, అక్టోబర్‌ 21 (విజయ క్రాంతి): ఈనెల 24 నుంచి 31 వరకు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని (Eye Camp) ప్రజలు వినియోగించుకోవాలని న్యాయవాది పంద్రం శంకర్‌ కోరారు. కంటి వైద్య శిబిరానికి సంబంధించిన (Wall Posters) వాల్‌ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనవాసి కళ్యాణ్‌ పరిషత్‌ తెలంగాణ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. శంకర నేత్ర చికిత్సాలయం చెన్నై వారి సౌజన్యంతో (Free Eye Treatment) కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కరత్వాడ సర్పంచ్‌ విశ్వేశ్వరరావు, మండల ప్రముఖులు కనక అమృతరావు, పాట్నాపూర్‌ ఉపసర్పంచ్‌ ఆత్రం మోహన్‌, మాజీ సర్పంచ్‌ గోపాల్‌, వార్డు సభ్యులు అనిల్‌, దేవరావు, మడవి కృష్ణ, గోడం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు