ఆర్మూర్‌–ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ సర్వేపై హర్షం

22-10-2026 | 02:08pm

బోథ్‌, అక్టోబర్‌ 21 (విజయ క్రాంతి): ఆర్మూర్‌–ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ ఏర్పాటు కోసం జరుగుతున్న సర్వేలో మారుమూల గ్రామాలను కలుపుతూ పనులు కొనసాగుతుండడంపై రైల్వే లైన్‌ ఏర్పాటు సాధన కమిటీ అధ్యక్షుడు నంగి శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. విజయ క్రాంతి దినపత్రికలో రైల్వే లైన్‌ సర్వే పనులపై (Survey) వార్తా కథనం ప్రచురితం కావడంతో ఆయన స్పందించారు. గతంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

ఆదిలాబాద్‌–ఆర్మూర్‌ రైల్వే లైన్‌ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం (Transportation) మెరుగుపడుతుందని పేర్కొన్నారు. 2023 సంవత్సరంలో తాను కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. జాతీయ రహదారి పక్కన కాకుండా మారుమూల గ్రామాలను కలుపుతూ రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. ఇటీవల సర్వే పనులు కొనసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో బోథ్‌, బజార్‌హత్నూర్‌ మండలాల ప్రజలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. తాము ఇచ్చిన వినతిపత్రాన్ని మంత్రి పరిశీలించి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యం (Rail Connectivity) అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు