సోనియా గాంధీ నుంచి ఊహించని అప్‌డేట్

22-10-2026 | 11:34am

ప్రేమ, బాధ్యత, విషాదం.. సోనియా కొత్త పుస్తకంలో ఏముంది?

ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. తొలి పోస్ట్‌తోనే ఆసక్తి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi Instagram Debut) సోషల్ మీడియాలో మరో కొత్త అడుగు వేశారు. గురువారం ఆమె తొలిసారిగా Instagramలోకి ప్రవేశించి, త్వరలో విడుదల కానున్న తన పుస్తకం ‘Belonging: A Journey of Love’కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన జీవిత ప్రయాణంలో ప్రేమ, బాధ్యత, నష్టాలు, మనకు చెందిన స్థానం కోసం చేసే అన్వేషణ వంటి అంశాలు ఈ పుస్తకంలో ప్రధానంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. సోనియా గాంధీ తన Instagram ఖాతాలో ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు.

అందులో ఆమె తన కొత్త పుస్తకం ప్రతిని అందుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సందర్భంగా తన పుస్తకానికి సంబంధించిన తొలి రూపాన్ని అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ‘Belonging: A Journey of Love’ అనే టైటిల్ ఇప్పుడు రాజకీయ, సాహిత్య వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోనియా గాంధీ రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత అనుభవాలు, కుటుంబ బంధాలు, జీవితంలో ఎదురైన మార్పులు వంటి అంశాలపై ఈ పుస్తకం ఎలాంటి వివరాలను అందించనుందన్న ఆసక్తి నెలకొంది. అయితే, పుస్తకంలోని పూర్తి విషయాలు, విడుదల తేదీ, ఇతర వివరాలపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. ఆమె Instagram ఎంట్రీతో ఈ పుస్తకంపై పాఠకుల దృష్టి పడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు