గుండె చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేత
22-10-2026 | 02:15pm
భిక్కనూర్, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): భిక్కనూర్ గ్రామానికి చెందిన పేరుముల శ్రీలతకు గుండె సంబంధిత వ్యాధి చికిత్స నిమిత్తం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రూ.5 లక్షల ఎల్‌ఓసీ (LOC) అందజేశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్సకు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శ్రీలతకు ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. అత్యవసర సమయాల్లో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటారని ఉప్పరి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో జంగం ప్రభాకర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.