పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు
చేగుంట, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): చేగుంట మండల కేంద్రంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడిన తెలంగాణ ముదిరాజ్ పులిబిడ్డ పండుగ సాయన్న అని కొనియాడారు. తెలంగాణ పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు సాయన్న అని తెలిపారు.
సాయన్న 174వ జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు కాషాబోయిన పెద్ద భాస్కర్, మహంకాళి ఆలయ చైర్మన్ సండ్రుగు సతీష్, వడ్ల నవీన్ కుమార్, మసుల శ్రీనివాస్, సండ్రుగు స్వామి, నాగభూషణం, గడ్డమీద సిద్దిరాములు, చిట్టబోయిన రఘపతి, కట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.