హరీష్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లను కలిసిన ఆదర్శ్ రెడ్డి

22-10-2026 | 02:05pm

రామచంద్రపురం, అక్టోబర్‌ 22 (విజయ క్రాంతి): దసరా పండుగను పురస్కరించుకుని పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి మాజీ మంత్రి, శాసనసభలో బీఆర్‌ఎస్ ఉపనేత హరీష్ రావును, తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు (Greetings) తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి తదితర పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు