వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత్ జోరు

09-09-2026 | 05:10am

అహ్మదాబాద్, సెప్టెంబర్ 8: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్(World Archery Para Series) స్టేజ్-3 టోర్నమెంట్‌లో భారత పారా ఆర్చర్లు అద్భుతమైన ప్రదర్శనతో పతకాల పంట పండిస్తున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతి రివర్‌ఫ్రంట్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటివరకు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో ప్రపంచ చాంపియన్ తో మన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి జోడి ఇరాక్ జంటపై 152 తేడాతో ఘన విజయం సాధించి పసిడి పతకాన్ని గెలుచుకుంది. పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో పారాలింపిక్ పతక విజేత హర్విందర్ సింగ్, విజయ్ సుంది జోడి స్లోవేకియా జట్టును 6-2తో ఓడించి స్వర్ణాన్ని ముద్దాడింది.

మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో భవనా, పూజ జోడీ ఫైనల్‌లో చైనా చేతిలో 0-6తో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. మికస్డ్ టీమ్ డబ్ల్యూ1 విభాగంలో స్వాతి, ఆదిల్ మహ్మద్ నజీర్ అన్సారీ జోడి రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సాధించింది. విజువల్లీ ఇంపైర్డ్ 1 విభాగంలో తన్వి ప్రవీణ్ ఇంగాలే ఫైనల్‌లో సైప్రస్ ఆటగాడి చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. మహిళల వ్యక్తిగత డబ్ల్యూ1 విభా గంలో  స్వాతి చౌదరి రష్యాకు చెందిన ఎలె నా క్రూటోవాపై 6-2తో గెలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

విజువల్లీ ఇంపైర్డ్ 1 విభాగంలో భారత ఆటగాడు యుగల్ గార్గ్ కాంస్య పతక పోరులో తోటి భారతీయుడు పవన్ కుమార్‌పై విజయం సాధించి పతకం గెలిచాడు. శీతల్‌దేవి మహిళల కాం పౌండ్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణ పతక రేసులో నిలిచింది. అయితే, మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో పాయల్ నాగ్‌తో కలిసి ఆడిన శీ తల్ దేవి కాంస్య పతక పోరులో చైనా చేతిలో ఓడిపోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

మరిన్ని వార్తలు