చైతన్యానికి ఆయన సాహిత్యం: అదనపు ఎస్పీ నరేష్ కుమార్
09-09-2026 | 03:13pm
ఎస్పీ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు
కాళోజి చిత్రపటానికి ఘనంగా నివాళులు
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 09 ( విజయక్రాంతి ) : తెలంగాణ ప్రజల సమస్యలను తన రచనలు, కవిత్వం ద్వారా సమాజానికి తెలియజేసిన మహోన్నత వ్యక్తి కాళోజి నారాయణరావు అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా ఉద్యమాల గొంతుక కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో, సామాజిక విలువలను పెంపొందించడంలో ఆయన సాహిత్యం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.