KL Rahul మెరుపులు.. భారీ స్కోర్ దిశగా భారత్

03-10-2026 | 06:02pm

వెస్టిండీస్‌పై టీమిండియా ఫైట్

న్యూచండీగఢ్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా(india vs west indies odi 2026) భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా.. రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఆ తర్వాత వరుస వికెట్లు పడినా కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ భారీ స్కోర్ వైపు దూసుకెళ్తోంది. తాజా లైవ్ స్కోర్ ప్రకారం భారత్ 46.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (93), G, Brar (06) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.

భారత్‌కు ఓపెనింగ్‌లోనే పెద్ద షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 1 పరుగుకే, ఆ తర్వాత విరాట్ కోహ్లీ డకౌట్‌గా పెవిలియన్ చేరారు. ఇద్దరి వికెట్లను జేడెన్ సీల్స్ తీశాడు. అక్కడి నుంచి రోహిత్ శర్మ–రుతురాజ్ గైక్వాడ్ జోడీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ 85 బంతుల్లో 92 పరుగులు చేసి సెంచరీకి 8 పరుగుల దూరంలో ఔటయ్యాడు. అతడిని కీమో పాల్ క్యాచ్‌అవుట్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా అద్భుతంగా ఆడి 57 పరుగులు చేశాడు. 28.5 ఓవర్లో జేడెన్ సీల్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రుతురాజ్ తర్వాత నమన్ ధీర్ 30 పరుగులు చేసి వేగంగా పరుగులు రాబట్టాడు. అతడిని గుడాకేశ్ మోటీ ఔట్ చేశాడు. అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి 9 పరుగులకు కీమో పాల్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

జేడెన్ సీల్స్ భారత్ టాప్ ఆర్డర్‌పై ప్రభావం చూపాడు. గిల్, కోహ్లీ, రుతురాజ్ వికెట్లను అతడు పడగొట్టాడు. కీమో పాల్ రోహిత్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి వికెట్లు తీశాడు. గుడాకేశ్ మోటీ నమన్ ధీర్‌ను ఔట్ చేశాడు. ఇప్పటికే తొలి రెండు వన్డేలను గెలిచిన భారత్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో మూడో వన్డేలోనూ విజయం సాధించి 3-0 క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా చూస్తోంది.

మరిన్ని వార్తలు