దీప్తిశర్మ@6
టాప్ ప్లేస్‌లోనే శ్రీ చరణి
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్
దుబాయి, సెప్టెంబర్ 8: ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్(ICC Women's T20 Rankings)లో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Indian star all-rounder Deepti Sharma) అదరగొట్టింది. ఆసియా కప్ లో అద్భుతంగా రాణిస్తున్న ఆమె, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. ఆసియా కప్‌లో దీప్తి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లో కేవలం 1.90 ఎకానమీతో 8 వికెట్లు పడగొ ట్టింది. థాయ్‌లాండ్‌పై 3/0, హాంకాంగ్- చైనాపై 3/9, పాకిస్తాన్‌పై 2/5 గణాంకాలతో చెలరేగింది. మరో భారత బౌలర్ శ్రీ చరిణి టాప్ ర్యాంక్‌ను కాపాడుకోగా.. మరే భారత బౌలర్ టాప్-10లో లేరు.
శ్రీచరణి, దీప్తిల మధ్య దక్షిణాఫ్రికాకు చెందిన నోన్‌కులేకోమ్లాబా, ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్, లారెన్ బెల్ ఉన్నారు. వీరిద్దరి మధ్య 70 పాయింట్ల వ్యత్యాసం ఉంది. దీప్తి తనకంటే ముందు ఉన్న థాయిలాండ్‌కు చెందిన థిపాచా, పుత్తావోంగ్లను అధిగమించి 6వ స్థానంలో నిలిచింది. బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత బ్యాటర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ 5, 7, 10 స్థానాలను నిలబెట్టుకున్నారు. ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ సైతం టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఆల్ రౌండర్ల జాబితాలో విండీస్ క్రీడాకారిణి హేలీ మాథ్యూస్ అగ్రస్థానంలో ఉండగా, దీప్తి శర్మ 5వ స్థానంలో కొనసాగుతోంది.