బుమ్రా ఫిట్... హర్షిత్ రాణా ఔట్
ఫిట్నెస్ టెస్ట్ పాసైన స్టార్ పేసర్
రాణా స్థానంలో యశ్ ఠాకూర్
బెంగుళూరు, సెప్టెంబర్ 10: అఫ్ఘనిస్తాన్ తో టీ ట్వంటీ సిరీస్, ఆసియా క్రీడలకు ముందు భారత్ క్రికెట్ జట్టు(Indian Cricket Team)కు గుడ్ న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధించాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(BCCI Centre of Excellence)లో జరిగిన ఫిట్నెస్ పరీక్షల్లో బుమ్రా నెగ్గాడు.
సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో బుమ్రా ఆడనున్నాడు. ఆసియా క్రీడలకు కూడా అతను అందుబాటులో ఉంటా డు. ఇంగ్లండ్ పర్యటనలోనే బుమ్రాకు మో కాలి గాయమైంది. దాంతో అతను శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. తా జాగా అతను ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేశాడని, జట్టుకు అందుబాటులోకి వచ్చాడని బెంగళూరులోని సీఓఈ వర్గాలు పేర్కొన్నాయి. తెలుగు తేజం, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రె డ్డి కూడా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.
హర్షిత్ రాణా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. జూలైలో ఇంగ్లం డ్ పర్యటనలో హర్షిత్ రాణా తొడ కండరా ల గాయానికి గురై జట్టుకు దూరంగా ఉ న్నాడు. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు అతన్ని ఎంపిక చేసిన సెలెక్టర్లు ఫిట్నెస్ నిరూపించుకుంటేనే జట్టులో కొనసాగుతాడని స్పష్టం చే శారు. అతను గాయం నుంచి ఇంకా రికవరీ కాలేదని తెలుస్తోంది.
గతంలో తొడపిక్క గా యంతో బాధపడిన రాణా, కోలుకునే క్ర మంలోనే ఈ కొత్త గాయం బారిన పడటం తో అఫ్గన్ సిరీస్‌తో పాటు ఆసియా గేమ్సకు కూడా పూర్తిగా దూరమయ్యాడు. దీంతో హర్షిత్ రాణా స్థానంలో విదర్భ పేసర్ యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేశా రు. గత జులైలో జింబాబ్వే పర్యటనలో అం తర్జాతీయ అరంగేట్రం చేసిన అతడికి ఇది రెండో టీ20 సి రీస్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 7 మ్యాచ్‌లోనే 18 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు యష్ ఠాకూర్. ఆపై జింబాబ్వే పర్యటనలో 2 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు.