ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భూమిగారి రాజేందర్
11-09-2026 | 03:38pm
చేర్యాల, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేర్యాల మండల కేంద్రానికి చెందిన భూమిగారి రాజేందర్(Bhumigari Rajender) ఎన్నికయ్యారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు కేదాసి మోహన్ ఆయనకు ఆమోద పత్రం అందజేశారు.తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి గ్రామంలో సంఘాన్ని బలోపేతం చేసి దళిత జాతి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్(State Working President) కాశపాక రాజేందర్, జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.