సెమీస్‌లో భారత్ ఏ ఓటమి

27-11-2026 | 05:15am

తేలిపోయిన బౌలర్లు

ఫైనల్లో శ్రీలంక ఏ జట్టు

దోహా, నవంబర్ 26: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్(Asia Cup Rising Stars) టోర్నీలో భారత్ ఏ కథ ముగిసింది. సెమీఫైనల్లో శ్రీలంకపై భారత యువ జట్టు పరాజయం పాలైంది. బ్యాటర్లు రాణించి భారీస్కోరు చేసినా బౌలర్లు తేలిపోవడంతో ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ 50 ఓవర్లలో 317 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 40, అభిషేక్ శర్మ 78, తిలక్ వర్మ 53, షాబాజ్ అహ్మద్ 54 పరుగులతో రాణించారు. ఒక దశలో 350కి పైగా స్కోరు చేసిలా కనిపించినా చివర్లో లంక బౌలర్లు కట్టడి చేశారు.

అనంతరం భారీ లక్ష్యఛేదనలో శ్రీలంక ఏ దుమ్మురేపింది. ఓపెనర్లు లసిత్, సినెత్ జయవర్థనే శతకాలు సాధించడంతో మ్యాచ్ దాదాపుగా వన్‌సైడ్‌గా సాగింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హర్షిత్ రాణా, హర్ష దూబే పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.దీంతో లంక ఏ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. మరో సెమీస్‌లో శుక్రవారం బంగ్లాదేశ్ ఏ ,పాకిస్తాన్ ఏ తలపడనున్నాయి.

మరిన్ని వార్తలు