కుట్టు శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి
కుట్టు శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి
వడ్లూరులో 25 మంది మహిళలకు శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ
బెజ్జంకి, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో అందిస్తున్న నైపుణ్య శిక్షణలు అభినందనీయమని వడ్లూరు సర్పంచ్ పులి రమేష్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరాధ్య ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్(Aradhya Integrated Foundation) ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తిచేసుకున్న 25 మంది మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పులి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. కుట్టు మిషన్ శిక్షణ ద్వారా మహిళలకు నైపుణ్యాలు అందడంతో పాటు ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కలుగుతుందని అన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సిద్దిపేట, కరీంనగర్ ఇంచార్జ్ గుర్రం సంగీతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు మంకాల స్వామి, పులి శ్రీకాంత్, గాండ్ల రాధా తిరుపతి పాల్గొన్నారు.