సైన్స్ పోటీల్లో శ్రీ వివేకవర్ధిని విద్యార్థుల ప్రతిభ
ఇద్దరికి ద్వితీయ బహుమతులు.. ఇన్స్పైర్ ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయి ఎంపిక
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్(District Science Fair), ఇన్స్పైర్ పోటీల్లో కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. సైన్స్ ఫెయిర్‌లో సీనియర్, జూనియర్ విభాగాల్లో ద్వితీయ బహుమతులు సాధించడంతో పాటు ఇన్స్పైర్ పోటీల్లో రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఇన్స్పైర్ పోటీల్లో ఏ. కార్తీక్ రూపొందించిన 'ఎమర్జెన్సీ అలర్ట్ టు సేవ్ హ్యూమన్ లైఫ్' ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికైంది. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సెన్సార్లు, అలారం వ్యవస్థ ద్వారా పక్క ఇళ్ల వారికి సైతం తక్షణ సమాచారం అందించి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించే విధానాన్ని ఇందులో వివరించారు.
ఈ ప్రాజెక్టుకు కురెల్లి సుభాష్ గైడ్ టీచర్‌గా వ్యవహరించారు. సైన్స్ ఫెయిర్ సీనియర్ విభాగంలో బైరు సంజన విపత్తుల నిర్వహణ అంశంపై రూపొందించిన 'తేలియాడే ఇళ్లు' నమూనాకు ద్వితీయ బహుమతి సాధించారు. జూనియర్ విభాగంలో పింగిలి సత్యకి పర్యావరణ పరిరక్షణ, హరిత శక్తి ఇతివృత్తంగా రూపొందించిన 'బ్లూమ్స్ టిప్స్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ఎర్త్' ప్రాజెక్టుకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఎం. విష్ణు గైడ్ టీచర్‌గా వ్యవహరించారు. విద్యార్థుల విజయాలపై పాఠశాల కరస్పాండెంట్ చిర్రా యాకాంతం గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించి, గైడ్ టీచర్లను అభినందించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ప్రశంసించారు.