ప్రవళిక మృతి రాష్ట్ర ఉద్యోగులను కలిసివేసింది.
బాధిత కుటుంబానికి ఉద్యోగం, రూ.కోటి పరిహారం ఇవ్వాలి
ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షులు కరికే సత్యనారాయణ
సిద్దిపేట: మణుగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రవళిక మృతి యావత్ రాష్ట్ర ఉద్యోగులను కలిసివేసిందని ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం(RTC SC ST Employees Welfare Association) రాష్ట్ర ఉప అధ్యక్షులు కరికే సత్యనారాయణ అన్నారు. ప్రవళిక మృతికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రవళిక మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో అధిక రద్దీ, ప్రయాణికుల ఒత్తిడి, తగిన భద్రతా చర్యలు లేకపోవడం కార్మికుల విధులకు ఆటంకంగా మారుతున్నయన్నారు. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) అమలులో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారి భద్రతకు ప్రభుత్వం నుంచి తగిన ప్రాధాన్యం లభించడం లేదని పేర్కొన్నారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.1 కోటి పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
రద్దీ ప్రాంతాలు, సమయాల్లో అదనపు బస్సులు నడిపి అధిక ప్రయాణికుల రద్దీని నియంత్రించాలని, కార్మికుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట డిపో అధ్యక్షులు పురుషోత్తం, కార్యదర్శి బాలకిషన్, తదితరులు ఉన్నారు.