మైనర్ బాలికపై లైంగిక దాడి

05-11-2026 | 07:50pm

ఉట్నూర్, నవంబర్ 05 ( విజయక్రాంతి ): ఉట్నూర్ పోలీస్ స్టేషన్(Utnoor Police Station) పరిధిలోని కుమ్మరి తండా గ్రామంలో 3 సంవత్సరాల 11 నెలల గిరిజన బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు నమోదైన కేసులో నిందితుడు సయ్యద్ హాజీ @ హాజీ, తండ్రి సయ్యద్ హైదర్‌ను పోలీసులు అరెస్టు చేసి,  న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ  రిత్విక్ సాయి(ASP Rithwik Sai) తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల మేరకు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టడం జరిగింది. బాలిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది అన్నారు. ఈ సందర్భంగా ASP ఉట్నూర్ శ్రీ రుత్విక్ సాయి మాట్లాడుతూ... చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

మరిన్ని వార్తలు