విద్యార్థులు స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి

05-11-2026 | 07:42pm

తాడ్వాయి,(విజయక్రాంతి): విద్యార్థులు(Students) మారుతున్న రోజులకు అనుగుణంగా తమ స్కిల్స్ అభివృద్ధి(Skills Develop) చేసుకోవాలని డాటా సైన్స్ ఇంజనీర్ లిఖిత్ కుమార్(Data Science Engineer Likhith Kumar) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల(Tadwai Girls Gurukul School)లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తమ నిత్య జీవితంలో ఆర్టిపిసిఎల్ ఇంటిలిజెన్స్ విభాగం ముఖ్యపాత్ర పోషించబోతుందని తెలిపారు.దీనిపై ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేఖ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు