రైతులు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం పొందాలి

05-11-2026 | 07:53pm

తాడ్వాయి,నవంబర్,05(విజయ క్రాంతి): రైతులు వ్యవసాయంతో(Farmers and Agriculture) పాటు అదనపు ఆదాయం పొందాలని ఏపిడి విజయలక్ష్మి(APD Vijayalakshmi ) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు గ్రామంలో గురువారం సమూహ సమీకృత వ్యవసాయ విధానంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎర్రపహాడ్,నందివాడ గ్రామాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేశామని తెలిపారు.

రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడకుండా పాడి పరిశ్రమ,వ్యవసాయానికి అనుబంధంగా ఉండే జీవనోపాదులు ఏర్పరచుకొని అదనపు ఆదాయం పొందాలని సూచించారు.ఈ ప్రాంతంలో పండిన ధాన్యాన్ని ఇక్కడే మార్కెటింగ్ చేసుకొని ఎక్కువ లాభం ఆర్జించడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

అదనపు ఆదాయం పొందడానికి ప్రతి రైతు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లవ్వ,ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి,మోహన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సంతోష్ రెడ్డి,సంస్థ ప్రతినిధులు మెహర్, వాసన్,తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు