రోస్టర్ సవరణ తర్వాతే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలి

27-10-2026 | 04:38pm

మాల సంఘాల జేఏసీ వైస్‌ చైర్మన్ తుమ్మ శ్రీనివాస్ డిమాండ్

గజ్వేల్ అక్టోబర్ 27: తెలంగాణలో  ఏడు విశ్వవిద్యాలయాల్లో(Seven universities) అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.31ను వెంటనే ఉపసంహరించుకోవాలని, రోస్టర్ పాయింట్ల సవరణ పూర్తయ్యే వరకు నియామక ప్రక్రియను నిలిపివేయాలని మాల సంఘాల జేఏసీ వైస్‌ చైర్మన్ తుమ్మ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు తర్వాత ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల మాల సామాజికవర్గంతో పాటు మరో 57 కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసిన 25 నోటిఫికేషన్లలో ఆయా కులాలకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

రోస్టర్ పాయింట్ల సవరణ కోసం గత 20 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అలసత్వంతో నిరుద్యోగ యువత విద్యా, ఉద్యోగ అవకాశాలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రోస్టర్ విధానంలో యుద్ధప్రాతిపదికన సవరణలు చేపట్టి, ఆ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నత విద్యామండలి చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని తుమ్మ శ్రీనివాస్ కోరారు.

మరిన్ని వార్తలు