'డ్రంక్ అండ్ డ్రైవ్'లో ఐదుగురికి జైలు శిక్ష

18-09-2026 | 10:24pm

- 13 మందికి రూ. 1.2లక్షల జరిమానా

- లైసెన్స్ లేని 10 మందికి రూ.50వేలు ఫైన్

సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో రెండు రోజులుగా వాహనాల తనిఖీ చేయగా 13 మంది మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు(Traffic CI Muthyam Raju) తెలిపారు. శుక్రవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు పేర్కొన్నారు. విచారణ అనంతరం న్యాయమూర్తి వారిలో నలుగురికి రెండు రోజులు, ఒకరికి ఐదు రోజులు జైలు శిక్షతోపాటు రూ.10వేల చొప్పున రూ. లక్షా 20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ వెల్లడించారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 10 మందికి కలిపి రూ.50వేలు  జరిమానా విధించారని సీఐ ముత్యంరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు