అనారోగ్య బాధితుడికి ఆపన్నహస్తం

06-10-2026 | 12:48pm

సిద్దిపేట రూరల్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బత్తుల కనకయ్య అనారోగ్యంతో (Illness) బాధపడుతున్న విషయం తెలుసుకున్న గ్రామ నాయకుడు వంగ రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. కనకయ్య కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం (Financial Assistance) అందించారు.

మాజీ ఉపసర్పంచ్ ప్రకాష్ రెడ్డి సైతం రూ.5 వేల సాయం అందించారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచినందుకు కనకయ్య కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు (Thanks) తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిప్పని రమేష్, మాజీ ఎంపీటీసీ ఓజల్, సరోజినీ నాయక్, రంగు వెంకన్న, మంతూరి మల్లేశం, దండ్ల మల్లేశం, అమరేందర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు