ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత
నంగునూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని దర్గపల్లి ఎంపీయూపీఎస్ ప్రభుత్వ పాఠశాల(MPUPS government school) అభివృద్ధికి పలువురు దాతలు(Donors) ఉదారంగా ముందుకువచ్చారు. విద్యార్థుల సౌకర్యార్థం మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి(Former MPP Japa Srikanth Reddy) స్పోర్ట్స్ డ్రెస్సులు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి వంటగదికి రేకులు, పుల్లూరు వెంకటేశం ఐడీ కార్డులు, బెల్టులు అందించారు. అలాగే మేదిని మహేందర్ రెడ్డి, పదిరే నరసింహారెడ్డి వాటర్ ప్యూరిఫైయర్,ఫ్యాన్లు సమకూర్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ... అందరి కృషితో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 10 నుంచి 43కి పెరగడం అభినందనీయమన్నారు. బడి అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను ఎంఈవో దేశిరెడ్డి, సర్పంచ్ పెంబర్ల శైలజ –రమేష్,హెచ్ఎం శ్రీకాంత్ రెడ్డి సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.