మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలి...

21-09-2026 | 08:16pm

తాడువాయిలో మాట్లాడుతున్న ఎంఈఓ రామస్వామి 

తాడ్వాయి,సెప్టెంబర్,21( విజయ క్రాంతి ): విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని తాడువాయి ఎంఈఓ రామస్వామి(MEO Ramaswamy) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో సోమవారం ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతిరోజు విద్యార్థులకు ఖచ్చితంగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. కొత్తగా అమలైన స్పర్శ్ కార్యక్రమం పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు.

పాఠశాలకు వచ్చిన గ్రాంటులను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా బిల్లులు మంజూరు చేయించుకోవాలని సూచించారు. పాఠశాలలో నిర్వహించాల్సిన ఆన్లైన్ పనులైన సిసిఈ మార్కులు, ఏపీ ఏ ఏ ఆర్ జనరేషన్, జిపిఈపిఎఫ్ వెంట వెంటనే చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్పర్శ్ రిసోర్స్ పర్సన్ దేవకళ, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దమ్మన్నగారి  సంగారెడ్డి,సూర్య ప్రకాష్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు