ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు

24-09-2026 | 07:09pm

సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి

రామచంద్రపురం ఆగస్టు 24: రామచంద్రాపురం డివిజన్(Ramachandrapuram Division) పరిధి  రాయసముద్రం చెరువుల వద్ద  గణేశ్ నిమజ్జన  ప్రదేశాలను  సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి(Cyberabad CP Ramesh Reddy), పోలీస్ అధికారులు,ఆయా విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలలో భాగంగా తీసుకోవలసిన చర్యలపై సిపి పోలీస్ అధికారులకు వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సిపి రమేష్ రెడ్డి మాట్లాడుతూ  శుక్రవారం జరుగనున్న వినాయక నిమజ్జన ప్రక్రియలో భాగంగా  గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా గణనాథులను నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు పోలీసు అధికారులతో పాటు ఆయా శాఖల అధికారులకు, సిబ్బందికి ఆదేశించినట్టు ఆయన తెలిపారు.  ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గట్టి చర్యలు చేపడుతున్నామన్నారు. అదే విధంగా నిమజ్జన కార్యక్రమాలలో  భాగంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు