గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరపాలి

24-09-2026 | 08:17pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో శుక్రవారం నిర్వహించే గణేష్ నిమజ్జనం శోభయాత్ర(Ganesh Shobha Yatra)ను ప్రశాంతంగా భక్తివాతావరణం లో జరుపుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) కమిటీ సభ్యులకు సూచించారు. నిర్మల్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి శోభాయాత్ర ఆహ్వాన పత్రం అందజేశారు. గణేష్ నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు, తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసేలా  అధికారులను ఆదేశించినట్టు కమిటీ సభ్యులకు సూచించారు.

మరిన్ని వార్తలు