శ్రీరామ్ నగర్ కాలనీలో వన్ డే–వన్ వార్డు కార్యక్రమం
స్థానిక సమస్యలపై స్పందించిన అధికారులు.. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు
మణికొండ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): నార్సింగి మున్సిపల్ సర్కిల్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరామ్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో వన్ డే–వన్ వార్డు కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి(Deputy Commissioner Lakshma Reddy), మేనేజర్ శ్రీధర్ పాల్గొని స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులు, వీధి కుక్కల బెడద, స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సమస్యలను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై స్పందించిన అధికారులు, వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శులు శ్రీకాంత్, విజయ్ కుమార్, కోశాధికారి కృష్ణ, సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఉపేంద్రనాథ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, సభ్యుడు దిలీప్ కక్కడ, స్థానికులు ముత్తంగి లక్ష్మయ్య, బుధోలు బాబు, రాజు, చారి తదితరులు పాల్గొన్నారు.