అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన

03-10-2026 | 08:45pm

 వన్యప్రాణుల పరిరక్షణపై బైక్ ర్యాలీ

కోనరావుపేట, అక్టోబర్ 02 (విజయక్రాంతి): జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో(During National Wildlife Week celebrations) భాగంగా కోనరావుపేట మండలంలో గురువారం అటవీ శాఖ అధికారులు(Forest Department officials) విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అడవులను కాపాడటం, వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు.మండలంలోని వివిధ గ్రామాల్లో బైక్ ర్యాలీ కొనసాగిస్తూ వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అడవుల్లో అక్రమ వేటను అరికట్టాలని, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగించవద్దని అధికారులు సూచించారు.పర్యావరణ సమతుల్యతకు వన్యప్రాణుల సంరక్షణ ఎంతో కీలకమని తెలిపారు.అటవీ సంరక్షణలో గ్రామస్తులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాధవి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భీర్బాల్, అటవీ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు