లక్ష ఎకరాలకు నీరందేలా.. 9వ ప్యాకేజీ పూర్తి చేయాలి
01-10-2026 | 05:50pm
- సీఎం రేవంత్‌రెడ్డికి ఎగువ మానేరు ప్రాజెక్టు పరిరక్షణ సమితి వినతి
- కాలువల ఆధునీకరణతోపాటు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి
రాజన్న సిరిసిల్ల 01అక్టోబర్ (విజయక్రాంతి )ఎగువ మానేరు 9వ ప్యాకేజీ పనులను వెంటనే చేపట్టి నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని ఎగువ మానేరు ప్రాజెక్టు(Upper Manair Project) పరిరక్షణ సమితి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని(CM Revanth Reddy) కోరింది. ప్యాకేజీ పూర్తయితే సుమారు లక్ష ఎకరాలకు శాశ్వత సాగునీరు అందే అవకాశం ఉందని ఈ మేరకు సమితి ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం సీఎంకు వినతిపత్రం సమర్పించారు.
ఎగువ మానేరు కుడి, ఎడమ కాలువల్లో దెబ్బతిన్న లైనింగ్‌ను పునరుద్ధరించి, నీటి వృథాను అరికట్టేలా కాలువలను ఆధునీకరించాలని కోరారు. అలాగే రిజర్వాయర్ పరిసరాలను సుందరీకరించి వ్యూపాయింట్లు, వాకింగ్ ప్రాంతాలు, అవసరమైన చోట్ల బోటింగ్ వంటి సౌకర్యాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.