మహిళలు, చిన్నారుల రక్షణే పోలీసుల తొలి ప్రాధాన్యత

01-10-2026 | 06:35pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మహిళలు(Womens), చిన్నారుల రక్షణకు పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్(Asifabad SP Nitika Pant IPS) తెలిపారు. షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా కేంద్రాల ద్వారా నిరంతరం సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.సెప్టెంబర్‌లో షీ టీం(She Team) ఆధ్వర్యంలో జిల్లాలో 28 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.

76 హాట్‌స్పాట్ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి ఏడుగురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, 12 ఫిర్యాదులు స్వీకరించి మూడు ఎఫ్‌ఐఆర్‌లు, రెండు పెట్టీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మహిళలు, చిన్నారులు వేధింపులు, హింస లేదా సైబర్‌ వేధింపులకు గురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఆసిఫాబాద్ షీ టీం 8712670564, కాగజ్‌నగర్ షీ టీం 8712670565 లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు