ఓబులాపూర్ పాఠశాలలో విద్యార్థుల ఎన్నికల
తంగళ్ళపల్లి, నవంబర్ 26 (విజయక్రాంతి ): రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day) పురస్కరించుకొని ఓబులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రజాస్వామ్య ఎన్నికల విధానంపై అవగాహన కల్పించేందుకు బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్లతో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 9వ తరగతికి చెందిన బుర్ర సాహితి పాఠశాల అధ్యక్షురాలిగా, 10వ తరగతికి చెందిన అలవాల దత్తాచారి కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బండి ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతి, శ్రీకాంత్, జ్యోతి, పద్మ, కంప్యూటర్ టీచర్ రమ్య, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోట్ల శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.