ఉమ్మడి జిల్లా చెస్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థిని..

26-11-2026 | 11:55pm

విద్యార్థిని అభినందించిన పాఠశాల చైర్మన్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ 

సుల్తానాబాద్, నవంబర్ 26 (విజయ క్రాంతి):  జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో(Kodimial Mandal) ఈ నెల 28న నిర్వహించనున్న ఎస్‌జీఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్‌-14 బాలికల చెస్ పోటీలకు(SGF Chess Competition) పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థిని ఈ. వర్షిత ఎంపికైంది.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ మాటేటి కృష్ణప్రియ విద్యార్థినిని గురువారం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందుతాయని పేర్కొన్నారు. పాఠశాల తరఫున క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సునీత, మేనేజర్ శివ, వ్యాయామఉపాధ్యాయులు సత్యనారాయణ,సతీష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు