ఎల్ నినో ముప్పుపై అప్రమత్తం..
చేగుంట మండలంలోని మూడు గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు.. ప్రజలకు అధికారుల అవగాహన
చేగుంట నవంబర్ 26,విజయక్రాంతి: రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావంతో(El Niño effect) తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ చిన్న రెడ్డి, తహసీల్దార్ బాల్ లక్ష్మి, అన్నారు, గురువారం చేగుంట మండలంలోని రాంపూర్, గొల్లపల్లి, సోముల తండా గ్రామాల్లో ఎల్నినో ప్రభావం, నీటి సంరక్షణపై సర్పంచ్ ల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు.
ఈ కార్యక్రమనికి ఎంపీడీవో చిన్నారెడ్డి, తహసీల్దార్ బాలలక్ష్మి, హౌసింగ్ ఏఈ రియాజుద్దీన్, వ్యవసాయ అధికారి హరిప్రసాద్, మిషన్ భగీరథ ఏఈ దివ్య , వివిధ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే నీటి సమస్యలు, తాగునీటి కొరతపై ప్రజలకు వివరించారు. నీటిని వృథా చేయకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డుల ప్రాధాన్యత, వాటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, గ్రామాల అభివృద్ధి, నీటి సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.