నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

27-11-2026 | 12:09am

కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో ఎన్టీఆర్ నగర్, చైతన్య నగర్ ను అనుసంధానిస్తూ నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్(Electrical Transformer) ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం నూతనంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఇకనుంచి విద్యుత్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని వార్డు కౌన్సిలర్ వల్లందాసు ఉమ రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ ఆపరేషన్ రాములు నాయక్, ఆపరేషన్ ఏఈ రాజు, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ పెద్దాపురం, లైన్మెన్ విజయ్, స్థానిక నాయకులు దీప్ల, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు