ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

27-11-2026 | 12:00am

దమ్మపేట, నవంబర్ 26(విజయకాంతి): మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో(Gram Panchayat Office) గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం (Constitution Day of India) (సంవిధాన్ దివస్) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ పగడాల రమాదేవి పూలు చల్లి నివాళులు అర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ ప్రవేశికను పంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన సమానత్వమే దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, కార్యదర్శి దుర్గారావు, వార్డు మెంబర్లు దారా రమేష్, పానుగంటి లక్ష్మణ్ గౌడ్, రూపా రాంబాబు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు