ఉపాధి కల్పించండి సారూ..?

21-09-2026 | 03:37pm

ప్రజావాణిలో కలెక్టర్ కు మొర పెట్టుకున్న రాజు

ముస్తాబాద్,సెప్టెంబర్ 21(విజయక్రాంతి): ఉపాధి కల్పించాలని నాయకులను మంత్రులను కలసిన కనికరం చూపడం లేదని,ప్రభుత్వ అధికారులను(Government officials) కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదని సోమవారం ఏదైనా ఉద్యోగం కల్పించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు మొరపెట్టుకొని వినతి పత్రం అందజేసిన దివ్యాంగుడు మినుప రాజు.వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామానికి చెందిన మినుప రాజు తన తండ్రి గత ఏడాది క్రితం మృతి చెందగా ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన బాధలో తన ఆరోగ్యం సహకరించడం లేదని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు.

కుటుంబ పోషణ భారంగా మారిందని నేను పుట్టుకతో దివ్యాంగుడినని కష్ట పడి కూలీ పనులు చేయడం రాదని వాపోయాడు డిగ్రీ వరకు చదువుకున్నానని  నా తల్లిని నన్ను పోషించుకోవడానికి ఏదైనా  ఉద్యోగం కల్పించాలని లేదా ఉపాధి మార్గం చూపించాలని అధికారులను వేడుకుంటున్నాడు.ఇప్పటి వరకు ఏంతో మంది మంత్రులను,అధికారులు కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇప్పటికైనా నా గోడును అర్ధం చేసుకొని ఉపాధి కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

మరిన్ని వార్తలు