మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణ

21-09-2026 | 05:10pm

ఉప్పరి పవన్

చేగుంట సెప్టెంబర్ 21(విజయ క్రాంతి): గత4 ఏళ్లుగా “మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” నినాదంతో మట్టి గణపతి విగ్రహాల  తయారు చేసి విని యోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చేగుంట మండలం రెడ్డిపల్లి (Reddypalli)గ్రామనికి చెందిన ఉప్పరి పవన్  తెలిపారు. రెడ్డి పల్లి లోని  కాలనీ వాసులు గత నాలుగేళ్లుగా  మట్టి గణపతిని పూజిస్తూ పర్యావ రణ పరిరక్షణకు చేస్తున్న కృషి ఎందరికో ఆదర్శం,

ఈ సందర్బంగా ఉప్పరి పవన్ మాట్లాడుతూ ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలను గ్రామ చెరువులు కుంటలలో, నిమజ్జనం చేయడంవల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందన్నారు, దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో గత నాలుగు సంవత్సరాల నుండి మట్టి వినాయక తయారుచేసి,పూజిస్తున్నామని తెలిపారు

మరిన్ని వార్తలు