ఏఎంసి అభివృద్ధి పనులకు శ్రీకారం
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తలారి రాణి నర్సయ్య
ముస్తాబాద్,(విజయక్రాంతి): రైతుల సౌకర్యర్థం మెరుగైన సేవలు అందిచడం కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) లక్ష్యమని వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) చైర్మన్ తలారి రాణి నర్సయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(pothugal agricultural market committee) కార్యాలయంలో రైతుల సౌకర్యార్థం అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి నివేదిక పంపగా స్పందించిన ప్రభుత్వం 28.50 లక్షలు మంజూరు చేయడం జరిగింది.
శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల శిలాపలకను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... రైతులకు, మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు.వచ్చే నెల నుండి వరికోతలు ప్రారంభం కానున్నాయి వెంటనే పనులు మొదలు పెట్టి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని చైర్మన్ రాణి పేర్కొన్నారు.